ఆమనగల్లు: ప్రతి పల్లె, ప్రతి తండాకు సురక్షిత తాగునీరు అందించడమే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. ఆమనగల్లు, తలకొండపల్లి, వెల్దండ మండలాల్లో శనివారం సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమనగల్లులో నిర్వహిస్తున్న ఉచిత పోలీసు శిక్షణ కేంద్రంలో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. అనంతరం పోచమ్మగడ్డ తండాలో రూ.1.50 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరి ఆరోగ్యం కోసం సురక్షిత తాగునీరు ఎంతో అవసరమన్నారు. పల్లెలు, తండాల్లో సురక్షిత తాగునీరు అందించాలనే లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మహిపాల్, గోపాల్, గన్యానాయక్, రమేశ్‌నాయక్, నాయకులు పంతులునాయక్, శ్రీరామ్, హనుమంతు, వెంకట్‌నాయక్, సేవ్యానాయక్, జైపాల్, తిరుపతి, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, జైపాల్‌రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి


