ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026 8లోu ● రోజు తప్పించి రోజు.. ● ట్యాంకర్‌ వస్తేనే రోజుగడిచేది!

న్యూస్‌రీల్‌

సగం ఇళ్లకే ‘భగీరథ’

సగం ఇళ్లకే ‘భగీరథ’

జటిలం!

పాత తాండూరు పంప్‌హౌస్‌ వద్ద లీకేజీ అవుతున్న గేట్‌వాల్వ్‌

వికారాబాద్‌: ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. పైప్‌లైన్‌ లీకేజీలతో నీరు కలుషితముతోంది. అయినా పట్టించుకునేవారు కరువయ్యారు. వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో రోజు తప్పించి రోజు తాగునీరు సరఫరా అవుతోంది. మిషన్‌ భగీరథ పథకం 80శాతం మంది తాగునీటి అవసరాలను తీరుస్తోంది. మిగతా లోటును బోరు బావులు, హ్యాండ్‌ పంపులు భర్తీ చేస్తున్నాయి. మిషన్‌ భగీరథ ట్యాప్‌లను తొలగించడంతో నీరు వృథాగా పోవడమే కాకుండా మురుగు తిరిగి పైపుల్లోకి చేరుతోంది. దీంతో చాలా మంది ఇళ్లలోని బోరుబావులనే వాడుకుంటున్నారు. పట్టణ పరిధిలో 16,500 ఆవాసాలు..70 వేల మంది నివసిస్తున్నారు. జనాభా ప్రకారం రోజుకు 7 ఎంఎల్‌డీ(మిలియల్‌ లీటర్‌ ఫర్‌ డే) నీరు అవసరం.. ప్రస్తుతం రెండు రోజులకు 8 నుంచి 9 ఎంఎల్‌డీ నీరు సరఫరా అవుతోంది. పట్టణంలో 200 పైచిలుకు బోరు బావులు, 56 చేతి పంపులు ఉన్నాయి. నల్లాలు లేని చోట వాటిని వినియోగిస్తున్నారు. 16,500 గృహాలు ఉండగా 10,600 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వేసవిలో ఏదైనా సమస్య తలెత్తితే శివారెడ్డిపేట్‌ చెరువును నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇటీవల ధన్నారంలో నీటి సమస్య తలెత్తింది. గెర్‌గెట్‌పల్లిలో కొత్త బోరు వేసి ప్రజల ఇబ్బందులు తీర్చారు.

పరిగి: కాలనీకి ట్యాంకర్‌ వస్తేనే ఆ రోజు ఇంట్లో పనులు జరిగే పరిస్థితి నెలకొంది. నిత్యం ప్రజలు తాగునీటి కోసం యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఏప్రిల్‌ మొదటి వారంలోనే బోరుబావుల్లో నీటి మట్టం పడిపోయింది. దీంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మున్సిపల్‌ పరిధిలోని తిరుమల, సిద్దాంతి, భవానీ కాలనీల్లో.. మైత్రీ నగర్‌, టీచర్స్‌ కాలనీలో ప్రజలు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పట్టణంలో 32వేల జనాభా ఉంది. రోజుకు 4.16 ఎంఎల్‌టీ నీటి అవసరం ఉంది. 117 బోర్ల ద్వారా 1.26 ఎంఎల్‌టీ నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 2.20 ఎంఎల్‌టీ నీటిని మిషన్‌ భగీరథ ద్వార అందిస్తున్నారు. అమృత్‌ 2.0 పథకం కింద రూ.15.5 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు ట్యాంకులు నిర్మించాల్సి ఉంది. రెండేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదు. నాలుగు, ఐదు వార్డుల్లో మిషన్‌ భగీరథ పైప్‌లైన్లు లేవు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్‌ అధికారులు రోజూ ఐదు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీరు ఏ మాత్రం సరిపోవడం లేదని పలువురు పేర్కొన్నారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు.

మున్సిపాలిటీల్లో తాగునీటికి కటకట

శివారు కాలనీలు, గ్రామాల్లో మరింత అధికం

లీకేజీలతో వృథాగా పోతున్న నీరు

ఎండిపోతున్న బోరుబావులు

అవస్థల్లో పట్టణ ప్రజలు

చోద్యం చూస్తున్న పాలకులు, అధికారులు

తాండూరు: మున్సిపల్‌ పరిధిలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. అన్ని వార్డుల్లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పట్టణ పరిధిలో 36 వార్డులు.. 85 వేల మంది ఉన్నారు. జనాభా ప్రకారం రోజూ 12 ఎంఎల్‌డీ నీరు అవసరం. మిషన్‌ భగీరథ పథకం ద్వారా 9 ఎంఎల్‌డీల నీరు సరఫరా అవుతోంది. 14,706 గృహాలు ఉండగా 6 వేల ఇళ్లకే నీటి సరఫరా జరుగుతోంది. మూడేళ్ల క్రితం సాయిపూర్‌, గ్రీన్‌ సిటీ, పాత తాండూరు, ఇంద్రానగర్‌ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ కనెక్షన్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు నీటి సరఫరా చేయలేదు. ప్రస్తుతం ఈ కాలనీల ప్రజలు బోర్లు, ట్యాంకర్లపై ఆధారపడి నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. పలుచోట్ల పైప్‌లైన్లు లీకేజీ అవుతున్నా పట్టించుకోవడం లేదు. పాత తాండూరు పంప్‌ హౌస్‌ వద్ద గేట్‌వాల్వ్‌ లీకేజీ అవుతోంది. సమీపంలోని పొలాల్లోకి భారీగా నీరు చేరుతోంది. తాండూరు మున్సిపాలిటీకి అమృత్‌ 2.0 పథకం కింద రూ.26 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో నాలుగు వాటర్‌ ట్యాంకులు, పైప్‌లైన్‌ నిర్మాణ పనులు చేపట్టాలి. ఎన్‌టీఆర్‌ కాలనీలో ఒక ట్యాంక్‌, పాత మున్సిపల్‌ కార్యాలయ ప్రాంగణంలో మరో ట్యాంక్‌ నిర్మిస్తున్నారు. నిధులు మంజూరై రెండేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదు. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పట్టణ శివారులోని కాగ్నానది వద్ద ప్రజల తాగునీటి అవసరాల కోసం రెండు పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేశారు. కొడంగల్‌ మార్గంలోని పంప్‌ హౌస్‌ దశాబ్ద కాలంగా పని చేయడం లేదు. పాత తాండూరులోని పంప్‌ హౌస్‌ మాత్రమే ప్రజల దాహార్తి తీరుస్తోంది. ఈ పంప్‌హౌస్‌ పునరుద్ధరణకు రూ.16 కోట్లు మంజూరై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు టెండర్లు పిలువలేదు.

నీటి సమస్య రానివ్వం.. ఇందుకోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం.. ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం.. ఏటా వేసవిలో పాలకులు, అధికారులు చెప్పేమాటలివి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఎవరిని కదిపినా కన్నీటి బాధలే వ్యక్తమవుతున్నాయి. శనివారం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నెలకొన్న తాగునీటి సమస్యలపై ‘సాక్షి’ గ్రౌండ్‌రిపోర్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement