ఉపాధి సరే.. సౌకర్యాలేవి? ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రదేశాల్లో కనీస వసతులు లేక కూలీలు అవస్థలు పడుతున్నారు. 9లోu రేపటి నుంచి
విద్యా వారోత్సవాలు నేర నివారణకు
కార్డన్ సెర్చ్ దోహదం
మొయినాబాద్: సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నివారించేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చేవెళ్ల ఏసీపీ కిషన్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరు ఇంద్రారెడ్డినగర్ కాలనీ రాజీవ్ గృహకల్పలో శనివారం కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. కార్లు, బైక్‌లు, ఆటోలకు సరైన పత్రాలు ఉన్నాయా.. లేవా అని పరిశీలించారు. సరైన పత్రాలు లేని 21 బైక్‌లు, రెండు ఆటోలను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. కార్డన్ సెర్చ్ నేర నివారణ, పోలీసింగ్‌ను బలోపేతం చేయడంతోపాటు శాంతిభద్రతలను కాపాడటానికి దోహదపడుతుందన్నారు. తనిఖీల్లో మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డి, చేవెళ్ల జోన్ పోలీసులు పాల్గొన్నారు.
కలెక్టర్ దీపక్ తివారి
అనంతగిరి: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శనివారం నగరం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, ఫార్మర్ రిజిస్ట్రీ, సెన్సస్, విద్యా వారోత్సవాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. విద్యా వారోత్స వాలను విజయవంతం చేయాలని సూచించారు. సోమవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగే ముఖ్యమంత్రి సమావేశానికి ప్రతి మండలం నుంచి విద్యార్థులు వారి తల్లిదండ్రులు వచ్చేలా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఈఓ రేణుకాదేవి, డీఆర్‌డీఓ శ్రీనివాస్, సీపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.