కొడంగల్: కొడంగల్ మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా అంతరాయం లేకుండా జరుగుతోంది. కొడంగల్, పాత కొడంగల్, గుండ్లకుంట, కొండారెడ్డిపల్లి, బూల్కాపూర్, ఐనన్‌పల్లి గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మిషన్ భగీరథ తోపాటు కాగ్నా రక్షిత మంచినీటి పథకం కూడా అందుబాటులో ఉంది. ఒక పథకంలో ఇబ్బంది వస్తే ఇంకో పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణ శివారులో ఉన్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి గ్రామాల్లోని ఓవర్‌హెడ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేస్తున్నారు.


