అబ్దుల్లాపూర్‌మెట్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు మండలంలోని బాటసింగారం జెడ్పీహెచ్‌ఎస్ తొమ్మిదో తరగతి విద్యార్థి మండారి ధనాంజనేయులు ఎంపికయ్యాడు. ఈ నెల 7వ తేదీన సరూర్‌నగర్ ఇండోర్ ప్రధాన అథ్లెటిక్స్ మైదానంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అతడు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి 16 ఏళ్ల లోపు బాలుర విభాగంలో జావెలిన్ త్రో ఈవెంట్‌కు అర్హత సాధించాడు. దీంతో హనుమకొండ జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించే చాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నాడు. ఈ సందర్భంగా శనివారం పాఠశాల ఉపాధ్యాయులు, సర్పంచ్ గౌరిశంకర్‌చారి, ఉప సర్పంచ్ వెంకటేశ్‌యాదవ్, ఎంపీడీఓ శ్రీవాణి, ఎంఈఓ జగదీశ్ తదితరులు విద్యార్థిని అభినందించారు.


