రోబోటిక్‌ సర్జరీతో ఉత్తమ ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

రోబోటిక్‌ సర్జరీతో ఉత్తమ ఫలితాలు

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

రోబోటిక్‌ సర్జరీతో ఉత్తమ ఫలితాలు

రాంగోపాల్‌పేట్‌: భారతీయ రోగుల్లో హిప్‌ రీప్లేస్‌మెంట్‌ శస్త్ర చికిత్సలు క్లిష్టంగా ఉంటున్నాయని న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ బీ విక్‌లైన్‌ అన్నారు. సికింద్రాబాద్‌ మెడికవర్‌ ఆస్పత్రిలో రోబోటిక్‌ హిప్‌ రీప్లేస్‌మెంట్‌పై జాతీయ సదస్సు నిర్వహించారు. విక్‌లైన్‌ మాట్లాడుతూ.. రోబోటిక్‌ సర్జరీ ద్వారా ఇంప్లాంట్‌ను అత్యంత ఖచ్చితత్వంతో అమర్చడం వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతున్నామని అన్నారు. న్యూయార్క్‌లో రోగులను కేవలం ఆరు గంటల్లో డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. మెడికవర్‌ సికింద్రాబాద్‌ ఆస్పత్రి ఆర్థోపెడిక్‌ విభాగాధిపతి ఉదయ్‌ కృష్ణ మైనేని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement