బీసీ హక్కుల అమలుపై స్పష్టత ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

బీసీ హక్కుల అమలుపై స్పష్టత ఇవ్వాలి

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజ్‌కుమార్‌

తాండూరు టౌన్‌: బీసీల హక్కుల అమలుపై ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్‌ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఆదివారం మోదీ హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో బీసీలకు ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు ప్రత్యేక సబ్‌ కోటా ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని, బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించాలని కోరారు. లేదంటే తెలంగాణాలో బీజేపీ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఒక కలగానే మిగిలిపోతుందన్నారు.

విధులకు ఆటంకం కలిగించిన వారికి రిమాండ్‌

మీర్‌పేట: విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిని మీర్‌పేట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ సారంగపాణి కథనం ప్రకారం.. ఈ నెల 7వ తేదీన పోలీస్‌స్టేషన్‌కు చెందిన హోంగార్డు ధారావత్‌ లింగనాయక్‌, ఏఆర్‌పీసీ అఖిల్‌వాసులు సీఐ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నారు. గస్తీలో భా గంగా అర్ధరాత్రి బడంగ్‌పేట గ్రంథాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు ఉండటాన్ని గమ నించి అక్కడికి వెళ్లి వివరాలు అడిగారు. దీంతో వారు సిబ్బందితో వాగ్వివాదానికి దిగా రు. సదరు యువకులు మరికొందరికి ఫోన్‌ చేయడంతో అక్కడికి వచ్చిన మిగతవారు అందరూ కలిసి సిబ్బందిపై దాడి చేశారు. హోంగార్డు లింగనాయక్‌ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన సాయికుమార్‌, నర్సింహ, ప్రభులను రిమాండ్‌కు తరలించామని, మరో ముగ్గురు శివకుమార్‌, కృష్ణ, మహేష్‌లు పరారీలో ఉన్నారని ఎస్‌ఐ తెలిపారు.

వికసిత్‌ తెలంగాణమే లక్ష్యం

రాజేంద్రనగర్‌: ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని మహిళా మోర్చా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మేకల వనితారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ... వికసిత్‌ తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూ.7823 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement