బషీరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ కేంద్రాలు వేగం పెంచాలని మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జానకి ఆదేశించారు. శనివారం ఆమె ఏఎంసీ చైర్మన్ మాధవ్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ శంకర్‌రెడ్డితో కలిసి దామర్‌చెడ్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం తూకాల్లో అక్రమాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన మేరకు తూకాలు వేయాలని సూచించారు. రైతులకు కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి వసతి, టార్పలిన్ కవర్‌లు సిద్ధంగా ఉంచాలన్నారు. ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భారతిరెడ్డి, ఏపీఎం పద్మారావు, ఐకేపీ కొనుగోలు కేంద్రం కమిటీ సభ్యులు సావిత్రమ్మ, నవనీత, జగదీశ్వర్, ఉప సర్పంచ్ రవికుమార్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జానకి


