షాబాద్: కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రామంలో రూ.20లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం, రూ.20లక్షల నిధులతో సీసీరోడ్డు నిర్మాణ పనులు, రూ.5లక్షల నిధులతో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు పనులకు వారు శంకుస్థాపన చేశారు. పెద్దవేడు గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక సదుపా యాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామాలలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. గ్రామాలభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలన్నదే తన సంకల్పమని తెలిపారు. కార్యక్రమలో సర్ధార్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్‌రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచ్‌లు శ్రీశైలంయాదవ్, రాజసులోచన, అశోక్, ప్రభాకర్‌రెడ్డి, లావణ్యచెన్నయ్య, స్వరూప మహేందర్‌గౌడ్, రాజు, పెంటయ్య, యాదిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, జంగయ్య, శేఖర్, భరత్, రవీందర్, దేవేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


