అనంతగిరి: వికారాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన పలు శుభకార్యాల్లో స్పీకర్ ప్రసాద్‌కుమార్ పాల్గొన్నారు. వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీనియర్ న్యాయవాది బస్వరాజ్ పటేల్ కుమార్తె వివాహంలో పాల్గొన్నారు.
పశువైద్య శిబిరాలను
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా పశువైద్యాధికారి సదానందం
కొడంగల్ రూరల్: పశు వైద్య శిబిరాలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశువై ద్యాధికారి డాక్టర్ సదానందం అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం పట్టణంలోని పశు వైద్యశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు గర్భ నిర్దారణ పరీక్షలు, చికిత్స, ఎద గుర్తింపు తదితర సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పశువులను సాధ్యమైనంత వరకు నీడపాటున ఉండేలా చూసుకోవాలన్నారు. సమయానుకూలంగా తాగునీరు, మేత అందించాలని సూచించారు. దూడలకు ముర్రు పాలు తాగించాలని, పరిశుభ్రత పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీ నోవా, పశు వైద్యాధికారులు డాక్టర్ పరమేష్, డాక్టర్ అశోక్ రెడ్డి, సిబ్బంది వెంకటయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
అనంతగిరి: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం కృషి చేస్తోందని మత్స్య సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ పథకాల గురించి వివరించారు. చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, చేపలకు వచ్చే వ్యాధులు.. నియంత్రణ, అధికోత్పత్తికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
ప్రధాని సభను
విజయవంతం చేద్దాం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
నవీన్ కుమార్
అనంతగిరి: హైదరాబాద్‌లో 10వ తేదీ జరిగే ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు ప్రజలు, బీజేపీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం వికారాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకారం అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మెడికల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ రాజశేఖర్, జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద రెడ్డి, నాయకులు మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు శివరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


