తాండూరు: స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. సీఐ పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ నేపథ్యంలో ఫిబ్రవరి 13న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల, డీసీసీబీ చైర్మన్ రవిగౌడ్‌తో పాటు పురుషోత్తంరావు నిబంధనలకు విరుద్ధంగా కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లారు. ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కూడా కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయమై మరుసటి రోజున పది మంది బీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులపై బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. ఈ విషయమై ఫిబ్ర వరి 27న ఎన్నిక లసంఘంతో పాటు కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసి నా ఫలితం లేకపోవడంతో మార్చి 11న తాండూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. ఏప్రిల్ 4న కేసు నమోదు చేయాలని న్యా యమూర్తి తీర్పు వెలువరించారు. దీంతో ఈనెల 2న ఐదుగురిపైనా కేసు నమోదు చేశారు.


