ఇది చరిత్రాత్మక గెలుపు | - | Sakshi
Sakshi News home page

ఇది చరిత్రాత్మక గెలుపు

May 5 2026 9:25 AM | Updated on May 5 2026 9:25 AM

సంక్షేమ పథకాలే పార్టీకి అండ

బీజేపీ నాయకులు

కమలనాథుల విజయోత్సవం

అనంతగిరి: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని, ఇదీ ప్రజాస్వామ్య విజయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాధవరెడ్డి, శివరాజు అన్నారు. సోమవారం వికారాబాద్‌లో బాణసంచాలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పట్టారని తెలిపారు. దేశంలో మోదీ గాలి వీస్తుందన్నారు.కేంద్రం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలే పార్టీకి అండగా నిలిచాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్‌చార్జీ శ్రీధర్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అనిల్‌యాదవ్‌, ముఖ్య నాయకులు నందు, నరోత్తంరెడ్డి, యాస్కి మల్లికార్జున్‌, సాయిచరణ్‌రెడ్డి శ్రీనివాస్‌గౌడ్‌, రాములు, రమేష్‌ పాల్గొన్నారు.

మోదీకి బ్రహ్మరథం

కుల్కచర్ల: దేశం మొత్తం ప్రధాని మోదీ నాయకత్వం కోరుకుంటుందని బీజేపీ జిల్లా కన్వీనర్‌ కరణం ప్రహ్లాదరావు అన్నారు. అందుకు నిదర్శనం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరిలో ప్రజలు పార్టీకి బ్రహ్మరథం పట్టమేనని పేర్కొన్నారు. సోమవారం ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. అవినీతి, మతమార్పిడి, హిందువులపై దాడులు ఇలా ఎన్నో అరాచకాలకు కేంద్రంగా మారిన పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ అధికారంలోని రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీమండల అధ్యక్షుడు వెంకటయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్‌ హరికృష్ణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు అంజిలయ్య, మైపాల్‌, సర్పంచ్‌ అంజిలయ్య, ఉప సర్పంచ్‌ విజయకుమార్‌, శంకర్‌, హన్మంతు, రాంచంద్రయ్య పాల్గొన్నారు.

మూడు రాష్ట్రాల్లో విజయం

మర్పల్లి: ఇటీవల నిర్వహించిన 5 రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ఘన విజయం సాధించిందని పార్టీ మండల నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కమలనాథులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్‌ వరకు ర్యాలీ తీశారు. బాణసంచాలు కాల్చారు. మిఠాయి పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు రామేశ్వర్‌ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీమంత్‌కుమార్‌, జిల్లా నాయకులు లక్ష్మణ్‌, బలరాంగౌడ్‌, నాగయ్య, మండల నాయకులు శివకుమార్‌, శేఖర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement