భక్తిశ్రద్ధలతోవాసవీమాత జయంతి | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతోవాసవీమాత జయంతి

Apr 27 2026 8:36 AM | Updated on Apr 27 2026 8:36 AM

భక్తిశ్రద్ధలతోవాసవీమాత జయంతి క్రికెట్‌ టోర్నీ ప్రారంభం నేడు ఉచిత వైద్య శిబిరం హామీలన్నీ అమలు చేస్తాం

అనంతగిరి: కలెక్టరేట్‌లో ఆదివారం వాసవీమాత జయంతిని ఘనంగా నిర్వహించారు. అధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ప్రసాద్‌, క్రీడల విభాగం జిల్లా అధికారి సత్తార్‌, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

ధారూరు: స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సతీమణి స్వర్గీయ గడ్డం శైలజా స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆదివారం మండల కేంద్రంలో సర్పంచ్‌ ప్రమీలగౌడ్‌ ప్రారంభిచారు. ఇరుజట్ల తరఫున ఎస్‌ఐ రాఘవేందర్‌ టాస్‌ వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువత అన్ని క్రీడల్లో పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కల్వ కిరణ్‌కుమార్‌, లింగనపల్లి అశోక్‌ ముదిరాజ్‌, టీ మల్లేశం, బుజ్జయ్య గౌడ్‌, సంగమేశ్వర్‌, పంచాయతీ వారు సభ్యులు పాల్గొన్నారు.

అనంతగిరి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు జన్మదినం సందర్భంగా సోమవారం వికారాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మెడికల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మా శారద హాస్పిటల్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

నేటి నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

తాండూరు: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయంపై రైతులను చైతన్యం చేసేందుకు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు నెల రోజుల పాటు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌. సుధారాణి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా శాస్త్రవేత్తల బృందం, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి గ్రామాలలో రైతులకు అవగహన కల్పించనున్నారు. ఈ నెల 23నుంచి మే 23వ తేదీ వరకు రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. 40 గ్రామాల్లో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నారు.

ఆమనగల్లు: ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని రవాణ, బీసీ, సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం దేవస్థానం వెళ్తున్న ఆయనకు ఆదివారం ఆమనగల్లు పట్టణంలో పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్‌ నేతలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ మొదలైందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా అన్ని రూట్లలో బస్సులను పెంచినట్లు పేర్కొన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అభ్యర్థన మేరకు కల్వకుర్తి డిపోకు 20 కొత్త బస్సులు కేటాయించినట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు షాబుద్దీన్‌, వస్పుల శ్రీకాంత్‌, ఫరీద్‌, సురేశ్‌, అలీం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement