ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
మంచాల: గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ గుండెమోని మల్లేశ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మతండా గ్రామస్తులు ఆయనను కలిశారు. గ్రామంలో గాడివంపు ప్రాజెక్ట్ నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన వారిందరికి పింఛన్లు మంజూరు చేయాలని, సీసీరోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మాణాలను నిధులు ఇవ్వాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే తండాకు రూ.35 లక్షలకు పైగా నిధులు ఇచ్చామని, మరిన్ని ఇస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీధర్‌నాయక్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అమర్ నాథ్, వార్డు సభ్యులు నరేష్ నాయక్, బాలు నాయక్, నాయకులు హరికిషన్ నాయక్, వసురాం, హీరలాల్, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.


