నక్ష బాటల పునరుద్ధరణ | - | Sakshi
Sakshi News home page

నక్ష బాటల పునరుద్ధరణ

Mar 30 2026 12:05 PM | Updated on Mar 30 2026 12:05 PM

నక్ష బాటల పునరుద్ధరణ పెట్రోల్‌ దాడిలో విషాదం

మున్సిపల్‌ చైర్మన్‌ ప్రశాంత్‌కుమార్‌

కొడంగల్‌ రూరల్‌: రైతుల సౌకర్యార్థం నక్ష బాటల పునరుద్ధరణ చేపడుతున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ నందారం ప్రశాంత్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం పట్టణశివారులోని బీసీ గురుకుల విద్యాలయ సమీపంలో రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి తిర్మలాపూర్‌ అడవిలోని అమ్మవారి దేవాలయం వరకు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతాయని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బీటి రోడ్డు నిర్మాణం జరిగితే ఇబ్బందులు తొలుగుతాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డిల ప్రత్యేక చొరవతో రోడ్డు నిర్మాణ పనులు షురూ అయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ జోషి, డాక్టర్‌ హీరాలాల్‌, నర్సింలు, సాయిలు, ఊట్కూర్‌ రాజు, రాములు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ సర్పంచ్‌ సహా కుమారుడి మృతి

పరిగి: ఆస్తి కోసం మండలంలోని రూప్‌సింగ్‌తండాలో కన్న తండ్రిని, సొంత కుటుంబ సభ్యులను ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేసిన ఘటనలో చిక్సిత పొందుతున్న ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఈనెల 24న అర్ధరాత్రి సర్పంచ్‌ రమణిబాయి(52) కుటుంబంపై ఆమె సవతి కొడుకై న అనార్‌సింగ్‌ పెట్రోల్‌ పోసి నిప్పటించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో సర్పంచ్‌ సహా ఆమె భర్త హన్మంతునాయక్‌, కుమారులు వెంకటేశ్‌, శివలకు తీవ్ర గాయాలయ్యాయి. నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు(గవాజు)పై నుంచి పెట్రోల్‌ పోసి నిందితుడు నిప్పటించాడు. నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి వెంకటేశ్‌(24) మృతి చెందాడు. ఆదివారం ఆయన అంత్యక్రియలు పూర్తయిన కాసేపటికే రమణిబాయి సైతం మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హన్మంతు, చిన్న కుమారుడు శివలకు ప్రాణాపాయం లేదని కుటుంబీకులు తెలిపారు.

వెంకటేశ్‌ (ఫైల్‌)

రమణిబాయి (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement