● ఎస్పీ స్నేహ మెహ్ర
మోమిన్‌పేట: రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలు విధిగా పాటించాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హల్‌లో ‘అరైవ్ అలైన్’లో భాగంగా మోమిన్‌పేట పోలీసుల ఆధ్వర్యంలో మహవీర్ జనరల్ ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి వాహనదారుడు నియమాలను పాటించాలన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో స్పష్టమైన కంటి చూపు ఉండటం అత్యంత అవసరమన్నారు. అందుకోసమే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు చేయించి అద్దాలను ఇస్తున్నామన్నారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితిలో వాహనం నడిపించకూడదని చెప్పారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారులో ఉన్నవారు సీట్ బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు గ్రామంలో శిథిలావస్థకు చేరిన పాత పోలీస్‌స్టేషన్‌ను కూల్చి వేయాలని సర్పంచ్ సంధ్య ఎస్పీ స్నేహమెహ్రకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములునాయక్, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచు సంధ్య శుభాశ్‌గౌడ్, సీఐ వెంకట్, ఎస్‌ఐలు భరత్ భూషన్, గిరి, అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ కేసులో పైలెట్‌కు ఇచ్చిన గడువు పూర్తి
వివరణ ఇవ్వని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
చర్యలు ఉంటాయా లేదా అన్నదానిపై చర్చ
కొనసాగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందనే వాదన
వేటు వేస్తే తాండూరు బాధ్యతలు ఎవరికో?
వినిపిస్తున్న ముగ్గురు నాయకుల పేర్లు


