అనవసర ఖర్చులకు అధిక ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

అనవసర ఖర్చులకు అధిక ప్రాధాన్యత

Mar 26 2026 10:57 AM | Updated on Mar 26 2026 10:57 AM

బడ్జెట్‌ కేటాయింపుల్లో అనవసర ఖర్చులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని 7వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ ఇర్షాద్‌ ఆరోపించారు. పద్దులన్నీ కాకిలెక్కలేనని విమర్శించారు. మున్సిపల్‌ డీపీఆర్‌ తయారీకి ఏకంగా రూ.38.60 లక్షలు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ నిధుల దుర్వినియోగమేనని మండిపడ్డారు. పట్టణ జనాభా 70 వేలకు పైగా ఉందని అందుకు తగ్గట్లు కేటాయింపులు జరగలేన్నారు. ఎమ్మెల్యే గ్రాంట్‌ నిధులు రూ.కోటి, ఎంపీ నిధులు రూ.50 లక్షలు కేటాయించడం సరికాదన్నారు. ఈ బడ్జెట్‌ పూర్తిగా నిరాశపర్చిందన్నారు.

– షేక్‌ ఇర్షాద్‌, 7వ వార్డు కౌన్సిలర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement