పనులు | - | Sakshi
Sakshi News home page

పనులు

Mar 26 2026 10:57 AM | Updated on Mar 26 2026 10:57 AM

నెలాఖరుతో ముగియనున్న

ఉపాధి హామీ పనుల గడువు

రోజులు

753

6

వికారాబాద్‌: ఉపాధి హామీ పథకం పనుల గడువు ముంచుకొస్తోంది. కేవలం ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో లక్ష్యం పూర్తవుతుందా లేదా అనే సందేహం తలెత్తుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు 995 పనులు మంజూరయ్యాయి. రూ.65.82 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏడాది మొత్తం నిద్రావస్థలో ఉన్న అధికారులు ఇప్పడు మాత్రం హడావుడి చేస్తున్నారు. పనులు పూర్తి కాకుంటే నిధులు వెనక్కు వెళ్తాయని హైరానా పడుతున్నారు. రాత్రింబవళ్లు శ్రమించినా టార్గెట్‌ రీచ్‌ అయ్యే అవకాశం కనిపించడం లేదు. అదనపు సమయం ఒక్కటే ముందున్న మార్గం. దీనిపైనే అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురైతే ప్రత్యేక అనుమతులు తీసుకొని పనులను పూర్తి చేశారు. అయితే బిల్లుల మంజూరులో జాప్యం చోటు చేసుకుంది.

242 పనులు పూర్తి

జిల్లాకు 995 పనులు మంజూరు కాగా అందులో 726 సీసీ రోడ్లు, సైడ్‌ డ్రెయిన్‌లు. 269 ప్రహరీలు. వీటి కోసం రూ.65.82 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 164 సీసీ రోడ్లు, 78 ప్రహరీ పనులను పూర్తి చేశారు. మరో 753 పనులను పూర్తి చేయాల్సి ఉంది. గడువులోగా అన్నింటిని పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

హడావుడిగా పనులు చేస్తే..

పూర్తి కావాల్సిన పనులు వందల్లో ఉండటం.. గడువు తక్కువగా ఉండటంతో సంబంధిత అధికారులపై ఒత్తిడి పెరిగింది. హడావుడిగా పనులు చేస్తే నాణ్యత ప్రమాణాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ప్రత్యేక అనుమతులు తీసుకుంటే మిగిలిన పనులను కూడా పూర్తి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన

గ్రామాలకే పనులు

ఉపాధి పనులను నియోజకవర్గాల యూనిట్‌గా తీసుకుని కేటాయించారు. పనులు చేపట్టాక బిల్లు లు జీపీ ఖాతాల్లో జమ అవుతాయి. అయితే పను లు, నిధులు ఏ పంచాయతీకి ఎంత కేటాయించాలనే నిర్ణయాధికారం మాత్రం ప్రభుత్వం ఎమ్మెల్యేలకే కట్టబెట్టింది. అధికార పార్టీ సర్పంచులకే ఎక్కు వ మొత్తంలో నిధులు కేటాయించారని ప్రతిపక్ష పార్టీల సర్పంచులు ఆరోపిస్తున్నారు. ఈ నిధులను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమ పార్టీలో చేరితే నిధులు వస్తాయంటూ సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారని పలువురు పేర్కొన్నారు.

ఆలోగా పూర్తవ్వాలి

లేకుంటే నిధులు వెనక్కి

గత ఏడాది కూడా ఇదే పరిస్థితి

హడావుడి చేస్తున్న యంత్రాంగం

నాణ్యత పాటిస్తాం

ఉపాధి పనులపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాం. గడువు తక్కువగా ఉండటంతో వేగం పెంచాం. ఇప్పటికే చాలా పూర్తయ్యాయి. మిగతా వాటిని కూడా సకాలంలో పూర్తి చేస్తాం. నాణ్యత విషయంలో రాజీ పడం.

– ఉమేశ్‌, పీఆర్‌ ఈఈ, వికారాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement