ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి అవకాశాలు పెంచుకోవాలి

Mar 26 2026 10:57 AM | Updated on Mar 26 2026 10:57 AM

సెంట్రల్‌ సివిల్‌ పెన్షనరీ రూల్స్‌ అమలు చేయండి పశువుల సంత వేలం @ రూ.1.05 కోట్లు ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తు చేసుకోండి

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌

మోమిన్‌పేట: డ్వాక్రా మహిళలు ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ సూచించారు. బుధవారం మోమిన్‌పేట మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఇందిర మహిళా క్యాంటిన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంఘం సభ్యులు బ్యాంక్‌ రుణాలతో ఉపాధి పొందాలని, తోటి మహిళలకు కూడా పనులు కన్పించాలని సూచించారు. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించాలన్నారు. రాంనాథ్గుడుపల్లికి చెందిన బేగ లక్ష్మి మండల మహిళా సమాఖ్య నుంచి రూ.2 లక్షల రుణం తీసుకొని క్యాంటిన్‌ పెట్టడం జరిగిందన్నారు. ఆమె ఉపాధి పొందుతూ ఇతరలకు కూడా పని కల్పిస్తోందన్నారు. ప్రతి మహిళా వ్యాపార రంగంలో అడుగు పెట్టి రాణించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్‌, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ రాజమల్లయ్య, ఏపీఎం మధుకర్‌, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ

ఇబ్రహీంపట్నం రూరల్‌: రిటైర్డ్‌ ఉద్యోగులకు సెంట్రల్‌ సివిల్‌ పెన్షనరీ రూల్స్‌ అమలు చేయాలని తెలంగాణ స్టేట్‌ గవర్నమెంట్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం డీఆర్‌ఓ సంగీతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్‌ శర్మ, జనరల్‌ సెక్రెటరీ సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

తైబజార్‌ వేలం వాయిదా

యాచారం: మాల్‌ పశువుల సంత నిర్వహణ వేలం బుధవారం పంచాయతీ కార్యాలయం వద్ద పోటాపోటీగా జరిగింది. పలువురు వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. సర్పంచ్‌ అశోక్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో మండల పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు. పలువురు పోటీపడగా అందులో మాల్‌ గ్రామానికి చెందిన నిమ్మరాజు జంగయ్య రూ.1.05 లక్షలకు దక్కించుకున్నాడు. కాగా తైబజార్‌ వేలం వాయిదా పడింది.

కార్పొరేషన్‌ ఈడీ పద్మావతి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి ఎస్సీ కార్యచరణ ప్రణాళిక 2025–26 గాను రవాణా రంగం క్రింద ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు రైతులకు సబ్సీడీ రుణాలు అందించనున్నట్లు కార్పొరేషన్‌ ఈడీ పద్మావతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 2 వరకు ఎస్సీ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని ఆమె కోరారు. వ్యవసాయ పథకంలో వ్యవసాయ డ్రోన్‌, వ్యవసాయ యంత్రములు, పశుపోషణ పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ, తోటల పెంపకం, కిసాన్‌ నర్సరీ, అయిల్‌పామ్‌ సాగు, బోర్‌ బావితో సబ్‌ మెర్సిబుల్‌ పంపు సెట్‌, సర్వీస్‌ కనెక్షన్‌ చార్సె కోసం రూ.70 వేల–రూ.5 లక్షల వరకు సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు. ఆహార భద్రత కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రము, లైసెన్స్‌ ఉండాలి. ఎలక్రిక్ట్‌ ద్విచక్ర వాహనాలను గిగ్‌ కార్మికులకు ప్రాధాన్యత, దివ్యాంగులు సదరమ్‌ సర్టిఫికెట్‌, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, భూమి ధ్రువీకరణ పత్రాలను ఓబీఎంఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement