తాండూరు పట్టణంలో గ్యాస్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. వినియోగదారులకు సకాలంలో సిలిండర్ సరఫరా చేయడంలో ఏజెన్సీలు విఫలమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాళీ సిలిండర్లలతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మా బాధలు అధికారులకు పట్టడం లేదని పలువురు ఆరోపించారు. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి నుంచి పెట్రోల్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. బుధవారం మధ్యాహ్నం పెట్రోల్, డిజిల్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.
– తాండూరు


