మన్నెగూడలో ‘అరైవ్‌– అలైవ్‌’ | - | Sakshi
Sakshi News home page

మన్నెగూడలో ‘అరైవ్‌– అలైవ్‌’

Mar 26 2026 10:57 AM | Updated on Mar 26 2026 10:57 AM

ట్రాఫిక్‌ నిబంధనలపై

వాహనదారులకు అవగాహన

మద్యం తాగి డ్రైవింగ్‌ చేయొద్దని పోలీసుల హెచ్చరిక

పూడూరు: వాహనాదారులు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని చన్గోముల్‌ ఎస్‌ఐ భరత్‌రెడ్డి సూచించారు. ఎస్పీ స్నేహ మెహ్ర ఆదేశాల మేరకు గురువారం మండల పరిధిలోని మన్నెగూడ చౌరస్తాలో అరైవ్‌– అలైవ్‌ మూడో విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి, రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనాలు నడిపే విధానం, హెల్మెట్‌ ప్రాముఖ్యత, మద్యం తాగి వాహనాలు నడిపితే జరిగే నష్టాలను వివరించారు. అజాగ్రత్త, అతివేగం, రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ ప్రమాదకరమని వివరించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినా, మద్యం తాగి డ్రైవింగ్‌ చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది వెంకటయ్య, మహేందర్‌, నాగేష్‌, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement