తాండూరు రూరల్: తాండూరులో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆటలు ఇక సాగవని బీఆర్‌ఎస్ మీడియా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైల్‌రెడ్డి అన్నారు. బుధవారం పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరిపేట్ వీరేందర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ సర్పంచులకు నిధులు కేటాయించడంలో వివక్ష చూపడం సరికాదన్నారు. కేంద్రం ఇచ్చే నిధులపై మీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తాండూరు ప్రజల తరఫున పోరాటం చేసినా, ప్రశ్నించినా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఎకరాకు మాత్రమే రైతు బంధు ఇచ్చారని ఆరోపించారు. గద్దర్ అవార్డుల పేరుతో ప్రభుత్వం రూ.4 కోట్లు వృథా చేసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రైతులమీద ప్రేమ లేదన్నారు. తాండూరులో నాపరాతి గనులు, సుద్ధ, మట్టి, ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని తెలిపారు. రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతి పంచాయతీకి రూ.50 లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు స్వరూప, సునందమ్మ, శరణయ్యస్వామి, నాయకులు రాంలింగారెడ్డి, రాజప్పగౌడ్, ఉమాశంకర్, శకుంతల, వీరారెడ్డి, రాములు, శ్రీనివాస్, రాకేష్‌గౌడ్, ప్రవీణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
● ప్రశ్నించిన వారిపై కేసులా?
● బీఆర్‌ఎస్ మీడియా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైల్‌రెడ్డి


