ప్రమాదాల నివారణకు చర్యలు: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల నివారణకు చర్యలు: ఎస్పీ

Mar 26 2026 10:56 AM | Updated on Mar 26 2026 10:56 AM

అనంతగిరి: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందులో భాగంగా బ్లాక్‌ స్పాట్లను గుర్తించాలని ఎస్పీ స్నేహమెహ్ర ఆదేశించారు. బుధవారం వికారాబాద్‌లోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శాంతిభద్రతలు, పెండింగ్‌ కేసు లు, నేరాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లా డుతూ దొంగతనాల నియంత్రణకు, కేసుల ఛేదనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చోరీ సొత్తు రికవరీ చేసి బాధితులకు అందేలా చూడాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని తెలిపారు. మహిళలు, బాలల భద్రతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాపాలనా – ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బీ రాములు నాయక్‌, డీఎస్పీలు జానయ్య, శ్రీనివాసులు, శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీనివాస్‌, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement