ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు నియోజకవర్గానికి చేసిన సేవలు మరవలేనివని బీఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ కేంద్రంలో ఆదివారం జరిగిన రాములు దశదిన కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమ్యూనిస్టువాదిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాములు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధిని కోరుకున్నారన్నారు. ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అనంతరం రాములు కుమారులు త్రిలోక్(కౌన్సిలర్), కిరణ్‌కుమార్‌ను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రమేష్, జగదీశ్వర్, భరత్‌కుమార్, ఎండీ సుల్తాన్, సురేష్, మల్లేష్‌యాదవ్, ముత్యాల చిన్న, శివసాయి, ప్రవీణ్, వీరేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి


