తాండూరు టౌన్: పట్టణంలోని ఎస్సీ వార్డుల అభివృద్ధికి మంజూరైన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించడం సరికాదని స్వేరో జిల్లా నాయకుడు శివకుమార్, జై భీమ్ ఆర్గనైజేషన్ జిల్లా సెక్రటరీ అంజి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను 22వ వార్డులోని ఈద్గా వద్ద పాఠశాల భవన నిర్మాణానికి, విలియంమూన్ పాఠశాల ప్రహారీ నిర్మాణానికి, పాత తాండూరు బోన మ్మ ఆలయ సమీపంలోని బీసీ శ్మశాన వాటిక అభివృద్ధికి వినియోగించడం సరికాదన్నారు. సబ్‌ప్లాన్ నిధులు ఎస్సీ వార్డుల అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా, వాటిని ఇతర చోట్ల అభివృద్ధి పనులకు మళ్లించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎస్సీ వార్డులు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని సబ్‌ప్లాన్ నిధులతో వెంటనే అభివృద్ధి పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నరేశ్, కేతేశ్వర్, మహేశ్, సురేశ్, రమేశ్, బాలు, రాజు, సుధాకర్, సాయి పాల్గొన్నారు.
జై భీమ్ ఆర్గనైజేషన్ జిల్లా సెక్రటరీ అంజి


