గుర్తుకొస్తున్నాయి... | - | Sakshi
Sakshi News home page

గుర్తుకొస్తున్నాయి...

Mar 23 2026 10:08 AM | Updated on Mar 23 2026 10:08 AM

ముప్పై ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం

జ్ఞాపకాలను నెమరేసుకున్న పూర్వ విద్యార్థులు

దౌల్తాబాద్‌: మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌ 1996–97లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమ జ్ఞాపకాలను నెమరేసుకుని తమ గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు బాబుసింగ్‌, అనంత్‌రెడ్డి, రాంరెడ్డి, శివరాజు తదితరులు ఉన్నారు.

తాండూరు రూరల్‌: పట్టణంలోని పీపుల్స్‌ డిగ్రీ కళాశాలలో 1990–93లో బీఏ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. వీరి కలయికకు మండలంలోని అంతార తండాలోని భూకై లాస్‌ ఫంక్షన్‌హాల్‌ వేదికయింది. 112 మంది విద్యార్థులకు గాను 70 మంది హాజరై వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement