ముగిసిన ‘ప్రశిక్షణ మహాభియాన్‌’ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘ప్రశిక్షణ మహాభియాన్‌’

Mar 23 2026 10:08 AM | Updated on Mar 23 2026 10:08 AM

ఇబ్రహీంపట్నంరూరల్‌ : ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లి గూడలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ నెల 20 నుంచి నిర్వహిస్తున్న జిల్లా అర్బన్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ నియోజకవర్గానికి సంబంధించిన పండిత్‌ దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్‌– 2026 శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిఽఽశాయి. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర సంఘటన మహామంత్రి చంద్రశేఖర్‌ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.గౌతమ్‌జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, నిర్మాణం, కార్యకర్తల అభివృద్ధి, బూత్‌ స్థాయి బలోపేతం వంటి అంశాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించాలన్నదే శిక్షణ తరగతుల ఉద్దేశమన్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు బోల్గాం యశ్పాల్‌ గౌడ్‌, బండారు భాస్కర్‌, ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్‌, నందికొండ గీతారెడ్డి, రుద్రారం శంకర్‌, కార్యదర్శులు నరేష్‌ యాదవ్‌, సుందర్‌ నారాయణ, నూతి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ కొప్పుల నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్‌ రెడ్డి, రంగ నరసింహ గుప్తా, మొద్దు లచ్చిరెడ్డి, నాయకోటి పవన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement