రజక సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

రజక సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

Mar 23 2026 10:08 AM | Updated on Mar 23 2026 10:08 AM

తాండూరు టౌన్‌: రజక సంఘం పట్టణ శాఖ నూతన కార్యవర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేసింది. సంఘం గౌరవాధ్యక్షుడిగా ఆర్‌.నర్సింలు, అధ్యక్షుడిగా రాజు, ప్రధాన కార్యదర్శిగా శాంత్‌కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ మాట్లాడుతూ.. పట్టణంలో రజక కమ్యూనిటీ హాల్‌, దోబీ ఘాట్‌కు ప్రహారీ, ఆధునిక దోభీ ఘాట్‌ నిర్మాణానికి సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్‌ రజాక్‌, బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు రామకృష్ణ, కిరణ్‌, రజక సంఘం జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ పంజగారి ఆంజనేయులు, సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మోహన్‌, అసోసియేషన్‌ అధ్యక్షుడు సుధాకర్‌, ఉపాధ్యక్షుడు నాగప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement