పారిశ్రామిక కేంద్రంగా కొడంగల్‌ | - | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక కేంద్రంగా కొడంగల్‌

Mar 21 2026 6:41 AM | Updated on Mar 21 2026 6:41 AM

కొడంగల్‌: నియోజకవర్గాన్ని ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. శుక్రవారం శాసన సభలో బడ్జెట్‌ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో నిర్మించనున్న మల్టీ పర్పస్‌ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ కోసం భూ సేకరణ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కొడంగల్‌ పరిసర ప్రాంతంలో భారీ రేడియల్‌ రోడ్‌ వస్తున్నట్లు చెప్పారు. అలాగే కొడంగల్‌లో స్కిల్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందు కోసం నిధులు కేటాయించినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement