రుణ లక్ష్యాలు చేరుకోండి | - | Sakshi
Sakshi News home page

రుణ లక్ష్యాలు చేరుకోండి

Mar 21 2026 6:39 AM | Updated on Mar 21 2026 6:39 AM

‘ప్రజా పాలన’ లక్ష్యం చేరుకుందాం

అనంతగిరి: బ్యాంకర్లు రుణ లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్సీ యాక్షన్‌ ప్లాన్‌ 2025 – 26పై జిల్లా షెడ్యూల్డ్‌ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.లక్ష విలువ గల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని 90 శాతం సబ్సిడీతో ఇవ్వనున్నట్లు చెప్పారు. జొమాటో, స్వీగ్గి, ర్యాపిడో మొదలైన వాటిలో పనిచేస్తున్న వారికి ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. రూ.3 లక్షలు విలువ గల గూడ్స్‌, ప్యాసింజర్‌ త్రీ వీలర్‌ వాహనాన్ని 70 శాతం సబ్సిడీతో మంజూరు చేస్తామన్నారు. ఈ వాహనాల ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చని తెలిపారు. రూ.37 లక్షల విలువ గల సోలార్‌ యునివర్సల్‌ పంప్‌ కంట్రోల్‌ యూనిట్లను 60 శాతం సబ్సిడీతో ఇస్తామన్నారు. వీటి ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందవచ్చని పేర్కొన్నారు. షెడ్యూల్డ్‌ కులాల రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాకు 168 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర, 82 త్రిచక్ర వాహనాలు, 17 సోలార్‌ యూనివర్సల్‌ పంప్‌ కంట్రోల్‌ యూనిట్లు మంజూరైనట్లు వివరించారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబు మొజెస్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వీ యాదగిరి, ఎస్‌బీఐ, యూబీఐ, టీజీబీ, బీఓబీ, సీబీసీ, కెనరా, పీఎస్‌బీ మేనేజర్లు, అధికారులు, జిల్లా కంట్రోలర్లు, కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి

పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి పరీక్షల చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, ఇన్విజిలేటర్లతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్షలు జరిగేలా చొరవ తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, డీఈఓ రేణుకాదేవి పాల్గొన్నారు.

జిల్లాకు ఎలక్ట్రిక్‌ వాహనాలు, సోలార్‌ యూనిట్లు మంజూరు

బ్యాంకర్లకు కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచన

ఎస్సీ యాక్షన్‌ ప్లాన్‌పై ప్రత్యేక సమావేశం

దౌల్తాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేద్దామని కలెక్టర్‌ దీపక్‌తివారి అన్నారు. వంద శాతం లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శుక్రవారం దౌల్తాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని, పీహెచ్‌సీ, పాఠశాలలను సందర్శించారు. నిర్మాణ దశలో ఉన్న సీసీ రోడ్లు, పాఠశాల ప్రహరీని ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి నిర్మాణంలో వేగం పెంచాలన్నారు. అనంతరం జెడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పీహెచ్‌సీని సందర్శించి ఓపీ, ఇన్‌పేషంట్లు, వార్డులు, టీకాల, మందుల గదులను పరిశీలించారు. రోగులకు సౌకర్యార్థం ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామాల్లో వందశాతం వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్‌ సబ్జెక్టుపై మెలకువలు సూచించారు. బాగా చదివి వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, డీఎంహెచ్‌ఓ స్వర్ణకుమారి, పీఆర్‌ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ సుదర్శన్‌, హౌసింగ్‌ డీఈ చందర్‌, తహసీల్దారు గాయత్రి, ఎంపీడీఓ శ్రీనివాస్‌, సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement