ఇంటిపై పిడుగు | - | Sakshi
Sakshi News home page

ఇంటిపై పిడుగు

Mar 21 2026 6:39 AM | Updated on Mar 21 2026 6:39 AM

ఇంటిపై పిడుగు

తాండూరు రూరల్‌: ఓ ఇంటిపై పిడుగు పడిన ఘటన గుంతబాసుపల్లిలో చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాతరి యాదప్ప వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం రాత్రి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు వచ్చాయి. ఈసమయంలో యాదప్ప ఇంటిపై పిడుగు పడింది. ఈ శబ్దంతో ఇంట్లో నిద్రిస్తున్న యాదప్పతో పాటు ఆయన భార్య సువర్ణ, కూతురు కృష్ణవేణి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గంటపాటు ఏంజరిగిందో తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు. యాదప్ప తండ్రి కాశప్ప ఇంట్లోకి వెళ్లి చూడగా టీవీ కాలిపోయింది. ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్‌ సరితగౌడ్‌, ఉపసర్పంచ్‌ సాజ్జాద్‌ పటేల్‌ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై శుక్రవారం జీపీఓ తేజసింగ్‌ విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అస్గర్‌ పటేల్‌, దస్తయ్యగౌడ్‌ తదితరులు ఉన్నారు.

షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు

కాలిపోయిన టీవీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement