ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయండి
అనంతగిరి: రబీ సీజన్ వరి ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి రాజేశ్వరి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 129 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు వాటిని సందర్శించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాంటాలు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. సేకరించిన వడ్లను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని సూచించారు. అందుకు అవసరమైన లారీలను సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం, జిల్లా సహకార శాఖ అధికారి నాగార్జున, జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి, జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి


