కొనసాగుతున్న శిక్షణ తరగతులు
ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి సీతక్క
అనంతగిరి: వికారాబాద్ సమీపంలోని అనంతగిరిగుట్ట హరిత రిసార్ట్స్‌లో కొనసాగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులు 7వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై డీసీసీ అధ్యక్షులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మూసీ ప్రక్షాళన, ఎన్విరాల్‌మెంట్, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. ఆమెతో పాటు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సామాజిక వేత్త శాంతాసిన్హా, సీడబ్ల్యూసీ ఆహ్వానితుడు కొప్పుల రాజు పాల్గొన్నారు. శనివారం ఉదయం శిక్షణలో భాగంగా డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు వికారాబాద్ మండలం మదన్‌పల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించనున్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
రమేశ్‌కుమార్
తాండూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌కుమార్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలం దుగ్గాపూర్‌లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద ప్రతి గ్రామానికీ సీసీరోడ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాము, రాంసాగర్, వెంకట్, బాలప్ప తదితరులు పాల్గొన్నారు.


