మెరుగైన సేవలందిస్తాం
అనంతగిరి: పోస్టల్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని హైదరాబాద్ హెడ్‌క్వార్టర్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎన్‌ఆర్ విశాలాక్షి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలో సబ్ డివిజన్ పరిధిలోని బీపీఎంలు, అధికారులతో పోస్టల్ సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోస్టల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ సేవల్లో వస్తున్న కొత్త కొత్త సంస్కరణలు, విధానాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. సంస్థలోని అన్ని విఽభాగాలు చురుగ్గా పాల్గొంటేనే మంచి పేరు వస్తుందన్నారు. పోస్టల్ శాఖ బీమా ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రతి ఖాతాదారుడు పోస్టల్ సేవలను అందుకునేలా చూడాలన్నారు. రూ.520 ప్రీమియంతో ప్రమాద బీమా పాలసీ తీసుకుని రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మహేందర్ భార్య శశికళకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ క్లయిమ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ సూపరిడెంటెండెంట్ ఎం అనన్య ప్రియ, ఏడీ సత్యనారాయణ, వికారాబాద్ హెడ్ పోస్ట్ మాస్టర్ పద్మారావు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ తిరుపతి, మేనేజర్ క్రాంతి, బీపీఎంలు పాల్గొన్నారు.
హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ విశాలాక్షి


