అసైన్డ్ రైతులకు న్యాయం చేయండి
యాచారం: ఏళ్లుగా సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్న అసైన్డ్ రైతులకు న్యాయం చేయాలని మండలంలోని కొత్తపల్లి రైతులు కలెక్టర్ నారాయణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉప సర్పంచ్ కాలె అనితతో పాటు పలువురు రైతులు శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎకరాకు రూ.80 లక్షల పరిహారం, 200 గజాల చొప్పున ప్లాటు అందజేయాలని, పట్టా భూములు సేకరించకుండా భరోసా ఇవ్వాలని, భూసేకరణ ప్రక్రియ పూర్తిగా పంచాయతీ పరిధిలోనే జరగాలని కోరారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, మాజీ సర్పంచులు వెంకటయ్య, హబీబుద్దీన్, నాయకులు కాలె రమేష్, చిక్కుడు శేఖర్, కావలి జగన్, కావలి బాలయ్య, ఘనీ తదితరులు పాల్గొన్నారు.


