గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

Feb 27 2026 10:49 AM | Updated on Feb 27 2026 10:49 AM

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

మొయినాబాద్‌: ప్రజాప్రతినిధులుగా ఎన్నికై నవారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని.. గ్రామాలు, వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మొయినాబాద్‌లోని అంజనాదేవి గార్డెన్‌లో శుక్రవారం ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ కేక్‌ కట్‌చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు కేఎంఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా ప్రోత్సాహకంగా ఆర్థిక సహాయం చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్‌, సన్‌వెల్లి ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌, సర్పంచ్‌ వెంకటేశ్‌గౌడ్‌, కౌన్సిలర్లు షాబాద్‌ కిషన్‌, జగపతిబాబు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement