కాంగ్రెస్‌తోసొంతింటి కల సాకారం
డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి
కుల్కచర్ల: పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తో సాకారమవుతోందని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. గురువారం వారు మండల పరిధిలోని పీరంపల్లిలో ఇందిరమ్మ ఇంటిగృహ ప్రవేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేళ్లు డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట కాలయాపన చేసిందని.. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పీరంపల్లి సర్పంచ్ వెంకటయ్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జంగయ్య, మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు ఆనందం, నాయకులు మురళి, రమేశ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
పోలీసులమని..
దారి దోపిడీ
రెండు ఉంగరాలు అపహరణ
శంకర్‌పల్లి: పోలీసులమంటూ ఓ వ్యక్తిని మోసం చేసి, రెండు ఉంగరాలు చోరీ చేసిన సంఘటన శంకర్‌పల్లి పట్టణ శివారులో చోటు చేసుకుంది. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అంతప్పగూడ గ్రామానికి చెందిన కావలి కుమార్(59) బ్యాంకులో పని ఉండడంతో తన స్కూటీపై గురువారం మధ్యాహ్నం శంకర్‌పల్లికి బయలుదేరాడు. ఫత్తేపూర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో రాగానే.. రామంతపూర్ వైపు నుంచి ఇద్దరూ వ్యక్తులు బైక్ మీద వచ్చి కుమార్ స్కూటీని ఆపారు. తాము పోలీసులమని చెబుతూ ఐడీ కార్డులు చూపించి, రోడ్లపై దొంగలు తిరుగుతున్నారని, చేతికి ఉన్న ఉంగరాలు స్కూటీలోపల పెట్టుకోవాలని సూచించారు. తర్వాత కుమార్ చేతికి ఉన్న రెండు ఉంగరాలను తీయించి, వాటిని కవర్‌లో పెట్టినట్లు నటించి, రెండు రాళ్లను పెట్టి డిక్కీలో పెట్టారు. తర్వాత బ్యాంకు దగ్గరకు వెళ్లిన కుమార్ స్కూటీలో ఉన్న తన ఉంగరాలను చూసుకోగా.. రెండు రాళ్లు కనిపించాయి. మోసపోయినట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
బిల్డర్‌ను బెదిరించి రూ.కోటి డిమాండ్
అల్వాల్: నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ బిల్డర్‌ను బెదిరించి రూ. కోటి డిమాండ్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్వాల్ పోలీసులు తెలిపిన మేరకు.. ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన రాయల మోహన్‌రావు హస్మత్‌పేట ప్రాంతానికి చెందిన శివప్రసాద్, మీనాక్షిలతో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ చేసుకొని సాయినగర్ ఎన్‌క్లేవ్‌లో అపార్టుమెంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. కాగా జనవరిలో సిక్ విలేజ్‌కి చెందిన రఘురాజు తన అనుచరులతో కలిసి నిర్మాణ స్థలానికి వెళ్లి బిల్డర్ నుండి రూ. కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే స్థలాన్ని ధ్వంసం చేసి వ్యాపారానికి నష్టం కలిగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా బిల్డర్ లొంగకపోవడంతో ఓ ఛానల్ ద్వారా తప్పుడు వీడియో అప్‌లోడ్ చేసి డబ్బులు దండుకోవాలని ప్రయత్నించాడు.దీంతో బిల్డర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


