కేసులు పెండింగ్‌లో ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

కేసులు పెండింగ్‌లో ఉండొద్దు

Nov 21 2025 12:52 PM | Updated on Nov 21 2025 12:52 PM

కేసులు పెండింగ్‌లో ఉండొద్దు

కేసులు పెండింగ్‌లో ఉండొద్దు

● పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా మెలగాలి ● తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య

యాలాల: పోలీస్‌ స్టేషన్‌లో పెండింగ్‌ కేసులు లేకుండా ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య అన్నారు. గురువారం యాలాల పీఎస్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో సమావేశమయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో భాగంగా పలు సూచనలు చేశారు. ప్రతి రోజూ తప్పనిసరిగా వాహనాల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పీఎస్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్లను గుర్తించి, వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. డయల్‌ 100పై ప్రజలకు అవగాహన కల్పించాలని, చట్టవ్యతిరేక కార్యక్రమాలపై కఠినంగా ఉండాలన్నారు. అనంతరం పీఎస్‌లోని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు విఠల్‌రెడ్డి, విఠల్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement