హామీల అమలుకు వినతి | - | Sakshi
Sakshi News home page

హామీల అమలుకు వినతి

Nov 21 2025 11:42 AM | Updated on Nov 21 2025 11:42 AM

హామీల అమలుకు వినతి

హామీల అమలుకు వినతి

దోమ: వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించేలా ప్ర భుత్వం చర్యలు తీసుకోవాలని, ఆ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక తహసీల్దార్‌ గోవిందమ్మకు వినతిపత్రం అందజేశారు. అంనతరం వారు మాట్లాడుతూ.. వీఆర్‌ఏలకు పేస్కేల్‌, అర్హులైన వారికి పదోన్నతులు, వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని 2020లో ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా హామీలను నెరవేర్చాలని కోరారు. లేదంటే నిరసన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏలు నర్సింహులు, గోపాల్‌, హన్మంతు, సందీప్‌, గణేశ్‌, భాస్కర్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement