కొనుగోళ్లు లేక నష్టపోతున్న రైతులు
యాలాల: ప్రభుత్వ మద్దతు ధరతో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని కేవీపీఎస్, సీపీఎం నాయకులు మల్కయ్య, బుగ్గప్ప డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద రైతులతో మాట్లాడారు. తేమ శాతం కోసం పలువురు అన్నదాతలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారన్నారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే రైతన్నలు కోలుకోలేని విధంగా నష్టపోయారని, అటువంటి వారికి ఇంకా తేమశాతం, సవాలక్ష ఆంక్షలతో అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్, సీపీఎం నేతలు మల్కయ్య, బుగ్గప్ప


