వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి
● ప్రతిఒక్కరూ ఆమెనుఆదర్శంగా తీసుకోవాలి
● ఎస్‌ఐ మీనాక్షి
అనంతగిరి: వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి చూపిన పోరాట పటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మహిళా ఎస్‌ఐ మీనాక్షి అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని గౌతమి జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో లక్ష్మిబాయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. చదువుతోనే అమ్మాయి భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి తూర్పు శ్రీలతారెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, రాష్ట్రీయ కళా మంచ్ స్టేట్ కన్వీనర్ మల్లేశం, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


