మొక్కల లెక్క చూపకపోతే ఇంటికే | - | Sakshi
Sakshi News home page

మొక్కల లెక్క చూపకపోతే ఇంటికే

Nov 21 2025 6:54 AM | Updated on Nov 21 2025 6:54 AM

మొక్కల లెక్క చూపకపోతే ఇంటికే

మొక్కల లెక్క చూపకపోతే ఇంటికే

తాండూరు రూరల్‌: వన మహోత్సవంలో భాగంగా గ్రామాల్లో నాటిన మొక్కల లెక్క చూపకపోతే ఇంటికి పోవడం ఖాయమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి సత్తార్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కల సంరక్షణ బాధ్యత అధికారులదే అన్నారు. ఉపాధి హామీ పథకం కింద రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. పత్తి విక్రయించేందుకు వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. పంచాయతీ నూతన భవనాలు, పాఠశాలల ప్రహరీలు, కిచెన్‌ షెడ్లు, అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు ఎంత మేర నిధులు అవసరమో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని తెలిపారు. రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు గ్రామాల్లో రూ.30 లక్షలు వెచ్చించి గోదాంలు నిర్మించనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని ఆదేశించారు. డిసెంబర్‌ ఒకటి నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా గ్రామాల్లో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బాల్‌రెడ్డి, ఎంపీడీఓ విశ్వప్రసాద్‌, తహసీల్దార్‌ తారాసింగ్‌, ఎంపీఓ వినయ్‌కుమార్‌, పీఆర్‌ ఏఈ నందిని, ఏవో కొమురయ్య, ఏపీఓ నరోత్తంరెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నిర్మల, ఏఈవో, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు,

వన మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం

అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి

డిసెంబర్‌ ఒకటి నుంచి అన్ని పల్లెల్లో తిరుగుతా

ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement