విద్యాలయాలకు భూముల కేటాయింపు
దుద్యాల్: మండలంలోని హకీంపేట్, లగచర్ల, పో లేపల్లి గ్రామాల పరిధిలో విద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పారిశ్రామికవాడ కోసం సేకరించిన భూమిలో 224.04 ఎకరాలను విద్యాలయాలకు కేటాయించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను తహసీల్దార్ కిషన్, ఆర్‌ఐ నవీన్ కుమార్ బుధవారం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. ఒక్కో విద్యాలయానికి ఎన్ని ఎకరా లు కేటాయించాలనే ప్రొసీడింగ్‌ను కలెక్టర్ విడుదల చేసినట్లు తహసీల్దార్ తెలిపారు.
కేటాయింపులు ఇలా..
● ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 15.49 ఎకరాలు.
● ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రి, నర్సింగ్, పారామెడికల్, ఫిజియోథెరపీ కళాశాలల నిర్మాణం కోసం 22.42 ఎకరాలు.
● ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఏటీసీ సెంటర్ నిర్మాణానికి 3.14 ఎకరాలు.
● ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి 7.27 ఎకరాలు.
● ప్రభుత్వ పశువైద్య కళాశాలకు 27.19 ఎకరాలు.
● సైనిక్ స్కూల్ నిర్మాణానికి 11.69 ఎకరాలు.
● యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి 20 ఎకరాలు.
● ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ఎకర, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి 99 సెంట్లు.
● ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నిర్మాణానికి ఎకర, విద్యుత్ ఉప కేంద్రంకి 1.89 ఎకరాలు.
● ప్రభుత్వ సంబంధిత ఇతర నిర్మాణాల కోసం 114 ఎకరాలను కేటాయించారు.
ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన తహసీల్దార్ కిషన్


