చీరల పంపిణీ పండుగలా నిర్వహిద్దాం
అనంతగిరి: జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సజావుగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఇందు కోసం మండల, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


