ప్రభుత్వ భూములను కాపాడండి
తాండూరు టౌన్: తాండూరు డివిజన్ పరిధిలో ఆక్రమణలకు గురవుతున్న పలు ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజా సంఘాల నాయకులు బుధవా రం తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. తాండూరు నడి బొడ్డున ప్రభుత్వ ఆస్తిని అక్రమార్కులు కొట్టేశారని, గతంలో ఇక్కడ ఆర్డీఓగా పనిచేయడంతో పాటు ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన అధికారి అక్రమాలపై విచారణ చేపట్టాలన్నారు. యాలాల మండలం అగ్గనూర్‌లో ప్రభుత్వ నాలాను ఆక్రమించి, రైతులకు దారి లేకుండా చేసిన వారిపై, అట్టి భూములను రిజిస్టర్ చేసిన సబ్‌రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, టీఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఽఅధ్యక్షుడు బుగ్గప్ప, నాయకులు చంద్రయ్య, సాదిక్ తదితరులు వినతి పత్రంలో కోరారు.
సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన ప్రజాసంఘాల నాయకులు


