కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి
ధారూరు: ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని ధారూరు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి రైతులకు సూచించారు. మండల పరిధిలోని మోమిన్‌కలాన్, గురుదోట్ల గ్రామాల్లో ఆయన బుధవారం ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ ఆయన సందర్భంగా.. రైతులు 17 శాతం తేమ ఉండేలా శుభ్రమైన ధాన్యాన్ని తీసుకువచ్చి, విక్రయించాలన్నారు. ఏ గ్రేడ్ సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,389తో పాటు 500 ప్రభుత్వం బోనస్ ఇస్తుందని చెప్పారు. బి గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,369కు కొనుగోలు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు, సొసైటీ సీఈఓ నర్సింహులు, ఎంఈఓ సంజూరాథోడ్, మాజీ ఎంపీటీసీ రమేశ్‌కృష్ణ, నాయకులు చంద్రయ్య, గఫార్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.


