యాలాల ఎంపీడీఓగా సంపత్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

యాలాల ఎంపీడీఓగా సంపత్‌కుమార్‌

Nov 19 2025 8:31 AM | Updated on Nov 19 2025 8:31 AM

యాలాల

యాలాల ఎంపీడీఓగా సంపత్‌కుమార్‌

యాలాల ఎంపీడీఓగా సంపత్‌కుమార్‌ కంటి చూపుపై శ్రద్ధ అవసరం రెవెన్యూ సమస్యలపరిష్కారానికే భూ భారతి రోడ్ల అభివృద్ధికి కృషి

యాలాల: మండల నూతన ఎంపీడీఓగా సంపత్‌కుమార్‌ శర్మ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన పుష్పలీలను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేయడంతో ఆమె స్థానంలో సంపత్‌కుమార్‌ను నియమించారు. వనస్థలిపురం నుంచి తాండూరు మండల సూపరింటెండెంట్‌గా బదిలీపై వచ్చిన ఆయన యాలాల మండల ఎంపీడీఓగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. మండలంలోని అన్ని పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన ఎంపీడీఓను కార్యాలయ సిబ్బంది యాదగిరి, అన్నపూర్ణ, బాల్‌రాజ్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీంద్రయాదవ్‌

బొంరాస్‌పేట: ప్రతి ఒక్కరికీ కంటి చూపుపై శ్రద్ధ ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రవీంద్రయాదవ్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో హైదరాబాద్‌ శంకర నేత్రాలయ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 250 మంది వివిధ రకాల కంటి పరీక్షలు చేయించుకున్నారు. 66 మందిని కంటి ఆపరేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి హేమంత్‌కుమార్‌, ఐకేపీ డీపీఎం నర్సింలు, ఎంపీఎం గోపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాంచంద్రారెడ్డి, మల్లేశం, సీసీలు యాదయ్య, భీములు, రాంచంద్రయ్య, ఏఎన్‌ఎంలు లీలావతి, హైమావతి, అంజలి, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.

బంట్వారం: రెవెన్యూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అడిషనల్‌ కలెక్టర్‌ లింగ్యానాయక్‌ అన్నారు. మంగళవారం కోట్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పెండింగ్‌ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ నూతన ఆర్‌ఓఆర్‌ చట్టానికి అనుగుణంగా సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్‌ చంద్రకిరణ్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రూ.వేల కోట్లతో ప్రధాన రహదారులను విస్తరిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శంకర్‌పల్లి మండలం మియాఖాన్‌గడ్డ సమీపంలో మంగళవారం ఓ ప్రైవేటు పాఠశాల ప్రా రంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో రీజినల్‌ రింగ్‌రోడ్డు పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. చేవె ళ్ల నియోజకవర్గంలో రూ.250 కోట్లతో పలు రోడ్లకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాద ఘటన కలచి వేసిందని, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గు రు చనిపోవడం చూసి ఏడ్చేశాననన్నారు.

యాలాల ఎంపీడీఓగా  సంపత్‌కుమార్‌ 1
1/2

యాలాల ఎంపీడీఓగా సంపత్‌కుమార్‌

యాలాల ఎంపీడీఓగా  సంపత్‌కుమార్‌ 2
2/2

యాలాల ఎంపీడీఓగా సంపత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement