దుద్యాల్‌ ఎస్‌ఐగా శ్రీశైలం | - | Sakshi
Sakshi News home page

దుద్యాల్‌ ఎస్‌ఐగా శ్రీశైలం

Nov 19 2025 8:31 AM | Updated on Nov 19 2025 8:31 AM

దుద్య

దుద్యాల్‌ ఎస్‌ఐగా శ్రీశైలం

దుద్యాల్‌ ఎస్‌ఐగా శ్రీశైలం ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

దుద్యాల్‌: దుద్యాల్‌ మండల ఎస్‌ఐగా శ్రీశైలం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పని చేసిన యాదగిరిని జిల్లా ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేసినట్లు తెలిసింది. ఆయన స్థానంలో శ్రీశైలంను నియమిస్తూ ఉన్నతాధికాలు ఉత్తర్వులు జారీ చేశారు.

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ

అనంతగిరి: ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ అన్నారు. ఈ నెల 15న బాసర నుంచి ప్రారంభమైన బస్సు జాత కార్యక్రమం మంగళవారం వికారాబాద్‌ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ యాత్ర ఈ నెల 26న ఖమ్మంలో ముగుస్తుందన్నారు. ముగింపు ఉత్సవాలకు పార్టీ జాతీయ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక విధంగా, మిగితా రాష్ట్రాలను మరో విధంగా చూస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారి ఉపాధి అవకాశాలను దెబ్బతోస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్‌ పరం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. బస్సు జాత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్‌, నాయకులు గోపాల్‌రెడ్డి, అనంతయ్య, వెంకటేష్‌, సురేష్‌, బాబు, జగదాంబ, నసీమాబేగం, ఖాదర్‌, ఏసురత్నం, చంద్రయ్య, రాజేందర్‌, మంగమ్మ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

దుద్యాల్‌ ఎస్‌ఐగా శ్రీశైలం1
1/1

దుద్యాల్‌ ఎస్‌ఐగా శ్రీశైలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement