నిందితులను కఠినంగా శిక్షించాలి
ఏఐఏవైఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్
చేవెళ్ల: దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్‌పై పరువు హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా(ఏఐఏవైఎస్) అధ్యక్షుడు బేగరి ప్రభాకర్, ఉపాధ్యుడు టి.ప్రవీణ్ డిమాండ్ చేశౠరు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల దురహంకార హత్యల పరంపర కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. షాద్‌నగర్ మండలం ఎల్లంపల్లిలో ఎర్ర చంద్రశేఖర్, భవానీ ప్రేమ వివాహం జీర్ణించుకోలేఏని యువతి తల్లిదండ్రులు చంద్రశేఖర్ సోదరుడిని మాట్లాడుకుందామని పిలిచి పెట్రోల్ పోసి దారుణ హత్య చేశాడని ఆరోపించాడు. హత్యలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు వినోద్, ఎం.శ్రీనివాస్, కె.గణేశ్, బి.సత్తయ్య, యాదయ్య, నర్సింలు, హరిబాబు పాల్గొన్నారు.


