కోలుకుంటున్నాడు
ఫిరోజ్ చికిత్స నిమిత్తం ఆదివారం రాత్రి జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. కాళ్లు ,చేతులకు వాపులు, స్వల్పంగా గాయాలున్నాయి. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఎటువంటి ప్రమాదం లేదు.
– డాక్టర్ నౌమాజ్, జిల్లా ఆస్పత్రి వైద్యుడు
శాఖాపరమైన చర్యలు
అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తి కేసులో విచారణ నిమిత్తం ఫిరోజ్‌ను పెద్దేముల్ ఠాణాకు పిలిపించారు. ఫిరోజ్‌ను ఎస్‌ఐ, పోలీస్ సిబ్బంది కొట్టారని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం పెద్దేముల్ ఎస్‌ఐ, సిబ్బందిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. చికిత్స పొందుతున్న బాధితుడితోనూ మాట్లాడాం. గౌస్‌మియా అనుమానాస్పద మృతి పోస్టుమార్టం రిపోర్ట్ సైతం వచ్చింది. త్వరలోనే కేసును ఛేదిస్తాం
– నగేశ్, సీఐ, తాండూరు రూరల్


